మధురానుభుతులు పంచిన స్మ్రుతులు సత్యము
క్షుధానిదురలను తెంచిన సంగతులూ సత్యము
మదనపడి మలచిన ఒకే ఒరలో ఈ ద్వైతము
సుధనుకూడా చెరుచును చేదు జ్ఞాపకాల విషము
ధనఋణ రాశుల కలయిక పరిణామము శూన్యము
మనసున ఆశానిరాశల పరిమాణము అగునా సమతుల్యము?
సంకీర్ణమైన సుధవ్యధలను విడిపరుచుటకు కావలిక ఋణము
క్షీరనీరములను వేఱు చేయు మరాలియొక నైపుణ్యము
జీవించక తప్పని జగన్నాటకమున జత ఉండే నీ అవలోకనము
తటస్థంగా తిలకిస్తే తెలుపదా జీవితపు మరో కొణము ...